titanic సినిమా దర్సకుడు జేమ్స్ కెమెరూన్ యేసు ప్రభువు యొక్క సమాధిని కనుగొన్నాడంట. అది ఎంత వరకు నిజమో ఆయనకే తెలియాలి. ఈ ఆదివారం Discovery లో ఆ కార్యక్రమం వస్తుందిట. చూడాలి, ఎలా చూపిస్తాడో..

మరింత సమాచారం కోసం ఈ కింది లెంకె ను చూడండి:

http://benwitherington.blogspot.com/2007/02/jesus-tomb-titanic-talpiot-tomb-theory.html

నీలాకాశం లో హరివిల్లు చూపించవా నల్ల నల్లని మేఘాలు
బంగారు రంగుల కలలు చూపించవా.. నడిరేయి లో నీలి కళ్ళు..

ఉరుమే వింటూ ఉలికి పడుతూ ఉంటే చిగురు తొడిగేదెలా పసిడి పంటచేను
మెరుపే వింటూ మురిసిపోతూ ఉంటే మనసు చేస్తుందిరా నెమలి నర్తనాలు

కమ్ముకు వచ్చే కాళ రాత్రి అంటే మరో సూర్యోదయానికి చూలాలంట
అలుపనిపించే కలతలేమిటి అంటే నిజం కాబోయే ఊహల బరువేనంట..

ఈ పాటను సిరివెన్నెల గారు రాశారు. ఇది ఏ చిత్రం లోనిది, సంగీతం ఎవరు అని ఏ విషయాలూ నాకు తెలియవు. కాని, పాట చాలా బాగుంది. లిరిక్ తప్పు రాసుంటే, క్షమించండి. :)

 ఎవరికైనా ఈ పాట తెలిసి ఉంటే, చెప్పండి. పాట వినాలని ఉంది. :)

నా మొదటి టపా సిరివెన్నెల గారి కవిత తో ప్రారంభిస్తాను.

ప్రాణాలే పందెంగా వేసి పోరాడందే..
ఏ విజయం ఒళ్ళో పడుతుందీ..!
ఏనాడో చెప్పింది.. ఏనాడూ మారనిది..
శ్రీ కృష్ణుడి గీతా సారమిది..!
యుద్ధం మొదలవ్వందే.. ప్రశ్నిస్తూ కూర్చుంటే..
అపజయమే బదులై వస్తుంది..!

సిరివెన్నెల.

« వెనుకటి పుటము