నీ మూగ వీణై మోగేనా..
నీ రాగమాలై పాడేనా..
అనురాగం రాగంగా
అభిమానం గీతంగా.. నే పాడేనా..
శిల వంటి నీ హృదయం లో శ్రుతి నేను కానా
ఓదార్చి నిను లాలించే ఒడి కానా
తనకంటూ ఒక మనిషంటూ ఉంటేనే బ్రతుకూ
నిదురించే నీ హృదయం లో కదలాడే కలనై
నీ కంటి లో కన్నీటి నై ఉంటాను ఓదార్పునై || నీ మూగ ||
అలిగావు నీవలిసావు అనురాగం కరువై
రగిలావు సెగలెగిసావు బ్రతుకంతా బరువై
మేఘాన్నై అనురాగాన్నై చినికాను చినుకై
పులకించీ నువు చిగురించీ తెరవాలీ మనసై
నీ నవ్వులో నే పువ్వునై పూస్తాను నీకోసమై || నీ మూగ ||
ఈ పాట “కిరాతకుడు” చిత్రం లోనిది. యస్. జానకిగారు పాడారు. ఇళయరాజాగారి సంగీతం. andhravilas.com లో ఉంది ఈ పాట. ఈ సినిమా లో మిగితా పాటలు కూడా బానే ఉన్నాయ్ కాని, ఈ పాట నా మనసు గెలుచుకుంది. జానకిగారి గొంతు లో ఈ పాట చాలా బాగా వచ్చింది. రెండవ చరణం లో “మేఘాన్నై అనురాగాన్నై చినికాను చినుకై ” అని ఉంది. “చినికాను” అనటం ఎంటో అర్థం అవ్వలేదు. ఈ పాట రాసింది ఎవరో కూడా తెలియలేదు. మొన్న “పాడాలని ఉంది” లో ఒక అమ్మాయి పాడింది. ఈ పాట రచయిత గురించి బాలుగారు చెప్పలేదు. ఎవరికైనా, ఈ పాట రాసిన వారు ఎవరో తెలిస్తే, చెప్పండి.
మార్చి 20, 2007 at 6:41 అపరాహ్నం
నిజమేనండీ.”రమ్మంటావా” అనే ఒక్క పదాన్ని ఇన్ని రకాలుగా చెప్పడమేగదా కవిత్వమంటే.
“చినుకై చినికాను ” అంటే కొత్త అర్ధమేమీ వుందకపోవచ్చు ననుకుంటున్నాను.