నిన్న మా టివి లో బాలు గారిది ఏదో సభ వచ్చింది. దాంట్లో ఆయన తన పాటలు చాలా పాడారు. కొన్ని పాటలు చరణ్ గారు కూడా పాడారు. నేను మొత్తం కార్యక్రమం చూడలేకపోయినాను. కాని, చూసినంత వరకు మాత్రం నాకు నచ్చిన అన్ని పాటలు ఆయన పాడారు.
మొదటగా ఆయన పాడిన Mr పెళ్ళాం సినిమా లోని “సరికొత్త చీర” పాటను చరణ్ గారి చేత పాడించారు. చరణ్ గారి గొంతు అచ్చు బాలు గారి గొంతు మాదిరే ఉండింది.
ఇక రెండవ పాట “సువ్వి సువ్వి” పాట. ఇది బాలు గారు, శైలజ గారు కలిసి పాడారు. మొదట్లో ఆయన రాగం తియ్యటం, శైలజ గారు సరిదిద్దటం, అచ్చు సినిమాలో ఉన్నట్లే చేసారు. ఆ పాట లో బాలు గారు ఒక line చాలా అందంగా పాడారు సినిమాలో. “గుండే లేని మనిషల్లే..” ఇప్పటికి కూడా గొంతు లోని ఆ తియ్యదనం అలానే ఉంది. ఆయనకి ఆ గొంతు దేవుడు ఇచ్చిన వరం.
తరవాత, “రవి వర్మ కే అందనీ ఒకే ఒక అందానివో” పాట. బాలు గారు మరియూ “పాడుతా తియ్యగా” కార్యక్రమం విజేత గోపికా పూర్ణిమ గారు పాడారు. గోపిక గారి గొంతు బాలు గారి తో బాగుంది. ఆవిడ చరణ్ గారి తో, మల్లిఖార్జున్ గారితో కూడా పాడింది కాని, బాలు గారి దెగ్గర ఆవిడ కొంచెం దృష్టి పెట్టి పాడింది. ఈ పాట లో ఆవిడ కి పెద్దగా ఎమీ లేదు పాడటానికి. నేపథ్య ఆలాపన మాత్రమే. ఇంతకీ, బాలు గారి గొంతు అలానే ఉంది. super గా.
ఇక ఆ తరవాత నాకు చాలా ఇష్టమైన పాట, “ఏ దివిలో విరిసిన పారిజాతమో”. చివర్లో ఆలాపనలు ఆయన కొంచెం మార్చారు. ఎందుకో తెలీదు. ఐనా బాగుంది. ఈ పాట బాలు గారు పాడినట్టుగా ఎవ్వరూ పాడలేరు.
ఇదంతా నేను నిన్న office కి డుమ్మా కొట్టటం వల్ల వచ్చిన లాభాలు. :)
సాయంకాలం ఒక ఇంటర్‌వ్యూ ఉండబట్టి కార్యక్రమం మొత్తం చూడలేక పొయ్యా.
ఈ music concert గురించి ఇంకా కావాలంటే, ఈ క్రింది లంకె ను చూడండి.
http://spbindia.blogspot.com/2007/02/telugu-music-concert-feb-16th-2007.html
బాలు గారి లాంటి ఒక గాయకుడు ఇంకొకరు దొరకరు. ఆయన హింది లో పాడితే, హింది ఆయన మాతృభాష అనుకుంటారు.. అరవం లో పాడితే, తమిళాయన అనుకుంటారు. భాష నేర్చుకోవాలన్న పట్టుదల అటువంటిది.
ఆయన గురించి greatandhra site వాళ్ళు వేస్తున్నారు. వీక్షించండి.
http://www.greatandhra.com/telugu/sumgathalu/18-02-2007/sp1_1.php
మార్చి 9, 2007 at 8:07 అపరాహ్నం
గానామృతం తాగిన గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం.
మార్చి 9, 2007 at 10:48 అపరాహ్నం
నిజమేనండీ…
ఆయన చాలా మంచి గాయకుడు. నాకు ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన మైనే ప్యార్ కియా, హం ఆప్కే హైన్ కౌన్ పాటలు చాలా ఇష్టం.
మంచి టాలెంటెడ్ కూడా. మాటే రాని చిన్నదాని పాట అద్భుతంగా పాడలేదూ..
మార్చి 9, 2007 at 11:19 అపరాహ్నం
ఘంటశాల వారి తరువాత అంత మధుర గాత్రం కల బాలసుబ్రహ్మణ్యం గారు మన తెలుగు వాడు కావడం మనకి గర్వకారణం.
మార్చి 10, 2007 at 2:07 పూర్వాహ్నం
బాలూ గారి గురించి సరే సరి, కానీ చరణ్ గాత్రం కూడ చాలా బాగుంటంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో చరణ్ కొన్ని మంచిగీతాలు పాడారు. తెలుగు తనం కని/వినిపిస్తుంటుంది…
ఫిబ్రవరి 15, 2011 at 7:33 అపరాహ్నం
pancharatna keerthanalu live programe classical lo and vocal lo pedite tyagaraja swamy uthsavamula samdarbhamga pedite bagundedi