నీలాకాశం లో హరివిల్లు చూపించవా నల్ల నల్లని మేఘాలు
బంగారు రంగుల కలలు చూపించవా.. నడిరేయి లో నీలి కళ్ళు..
ఉరుమే వింటూ ఉలికి పడుతూ ఉంటే చిగురు తొడిగేదెలా పసిడి పంటచేను
మెరుపే వింటూ మురిసిపోతూ ఉంటే మనసు చేస్తుందిరా నెమలి నర్తనాలు
కమ్ముకు వచ్చే కాళ రాత్రి అంటే మరో సూర్యోదయానికి చూలాలంట
అలుపనిపించే కలతలేమిటి అంటే నిజం కాబోయే ఊహల బరువేనంట..
ఈ పాటను సిరివెన్నెల గారు రాశారు. ఇది ఏ చిత్రం లోనిది, సంగీతం ఎవరు అని ఏ విషయాలూ నాకు తెలియవు. కాని, పాట చాలా బాగుంది. లిరిక్ తప్పు రాసుంటే, క్షమించండి. :)
ఎవరికైనా ఈ పాట తెలిసి ఉంటే, చెప్పండి. పాట వినాలని ఉంది. :)
ఫిబ్రవరి 27, 2007 at 3:56 పూర్వాహ్నం
నేనూ పూర్తి గా నమ్మకం గా చెప్పలేకపోతున్నాను.సాహిత్యం చదువుతుంటే ఒక పాట గుర్తొస్తుంది.అన్వయించుకుంటే సరిపోతున్నట్టే వుంది.ఈ మధ్య వచ్చిన “మొదటి సినిమా” అన్న సినిమాలోనిదిలా వుంది.కాని ఆ పాట పల్లవి ఇది కాదు.మీరు రాసిన ఈ లైనులు చరణం లోనివా?నేను చెప్పిన పాట టైటిల్స్ వస్తున్నప్పుడు వినిపిస్తూవుంటుంది.పూర్తిగా తెలుసుకుని త్వరలో తప్పక చెపుతాను
ఫిబ్రవరి 27, 2007 at 11:28 పూర్వాహ్నం
ఇక్కడ నేను రాసిన వాక్యాలు vennela.blogspot.com నుంచి తెచ్చినవి.
ఆయన april 10, 2003 ఇవి రాసారు. 6th may, 2003 నుంచి రాయట్లేదు. సో, ఈ పాట “మొదటి సినిమా” లోనుంచి ఐతే అయ్యి ఉండదు. :)