Hi all,

I am closing this blog and moving to Blogger. The problem I am facing with WordPress is that they wont allow me to add JavaScript and it is difficult to add songs to my blog. The next thing is that telugu font is beautiful in blogger than here.

 My Blogger ID: pradeepcr.blogspot.com

Hope we will meet there.

Thanks,
Pradeep.

సాపాటు ఎటూ లేదు

నాకు ఫార్వార్డ్ ఐన ఒక మైల్..
ఆకలి రాజ్యం సినిమా లో ”సాపాటు ఎటూ లేదు..” పాట కి పేరడి..

నీ మూగ వీణై మోగేనా..
నీ రాగమాలై పాడేనా..
అనురాగం రాగంగా
అభిమానం గీతంగా.. నే పాడేనా..

శిల వంటి నీ హృదయం లో శ్రుతి నేను కానా
ఓదార్చి నిను లాలించే ఒడి కానా
తనకంటూ ఒక మనిషంటూ ఉంటేనే బ్రతుకూ
నిదురించే నీ హృదయం లో కదలాడే కలనై
నీ కంటి లో కన్నీటి నై ఉంటాను ఓదార్పునై || నీ మూగ ||

అలిగావు నీవలిసావు అనురాగం కరువై
రగిలావు సెగలెగిసావు బ్రతుకంతా బరువై
మేఘాన్నై అనురాగాన్నై చినికాను చినుకై
పులకించీ నువు చిగురించీ తెరవాలీ మనసై
నీ నవ్వులో నే పువ్వునై పూస్తాను నీకోసమై || నీ మూగ ||

ఈ పాట “కిరాతకుడు” చిత్రం లోనిది. యస్. జానకిగారు పాడారు. ఇళయరాజాగారి సంగీతం. andhravilas.com లో ఉంది ఈ పాట. ఈ సినిమా లో మిగితా పాటలు కూడా బానే ఉన్నాయ్ కాని, ఈ పాట నా మనసు గెలుచుకుంది. జానకిగారి గొంతు లో ఈ పాట చాలా బాగా వచ్చింది. రెండవ చరణం లో “మేఘాన్నై అనురాగాన్నై చినికాను చినుకై ” అని ఉంది. “చినికాను” అనటం ఎంటో అర్థం అవ్వలేదు. ఈ పాట రాసింది ఎవరో కూడా తెలియలేదు. మొన్న “పాడాలని ఉంది” లో ఒక అమ్మాయి పాడింది. ఈ పాట రచయిత గురించి బాలుగారు చెప్పలేదు. ఎవరికైనా, ఈ పాట రాసిన వారు ఎవరో తెలిస్తే, చెప్పండి.

అందరికీ ఉగాది శుభాకాంక్షలు !!

పల్లవి
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
మువ్వలె మనసుపడు పాదమా
ఊహలె ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మ
ఆమని మధువనమా ఆ  ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా
 
చరణం 1
సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గస గా
పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడొ ఏమొ బ్రహ్మ
పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు
కళ్ళ ముందు నిలిపావె ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన యదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా
 
చరణం 2
సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా
వరములన్ని నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీ హరిగ మారునని రాసిపెట్టి
యే వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శౄంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ రాముని సుమ శెరమా ఆ రాముని సుమ శెరమా 

సాహిత్య సౌజన్యం: www.telugubiz.net

మొన్న వారం కిందట ఈ సినిమా వచ్చింది టివి లో. అప్పటినుంచి ఈ పాట నా computer లో మోగుతూనే ఉంది. సుశీల, లత మంగేష్కర్ గొంతుల్లో ఉండే శ్రావ్యత ఉష గొంతులో ఉంది. వాళ్ళు పాడుతూ ఉంటే, ఎంత బాగుంటుందో, ఉష పాడినా అలానే ఉంటుంది. కానీ ఈ మధ్య అంతగా పాడట్లేదు ఆవిడ. పెళ్ళి చేసుకుని US వెళ్ళిపొయ్యారు అని అన్నారు..

ఇంతకీ ఈ పాట కి నంది పురస్కారం వచ్చిందని తెలిసే ఉంటుంది. నేను మొదట్లో హింది పాటలు వినటం మొదలు పెట్టింది లత, రఫి గార్ల కోసం. లత గొంతులో ఏ రాగమైనా ఎంతో అందంగా పలుకుతుంది. రఫి గారి గొంతు ఏ భావానికైనా సరిగ్గా సరిపోతుంది. లత లాంటి గొంతు నేను ఉష లో వింటున్న. ఇక్కడ సుశీల గారి గురించి నేను మాట్లాదట్లేదు. ఆవిడ గురించి చెప్పాలంటే, ఈ బ్లాగు చాలదు. :)
నాకు నచ్చిన గాయకులలో లత, సుశీల, జానకి తరవాతి స్థానం ఉషదే. ఆవిడ మళ్ళీ సినిమాలలో పాడాలని నా కోరిక.
ఈ పాట మొదట్లో ఉష ఒక ఆలాపన వస్తుంది. ఖచ్చితంగా వినాల్సిన పాట. ఎమంటారు ?

నిన్న మా టివి లో బాలు గారిది ఏదో సభ వచ్చింది. దాంట్లో ఆయన తన పాటలు చాలా పాడారు. కొన్ని పాటలు చరణ్ గారు కూడా పాడారు. నేను మొత్తం కార్యక్రమం చూడలేకపోయినాను. కాని, చూసినంత వరకు మాత్రం నాకు నచ్చిన అన్ని పాటలు ఆయన పాడారు.

మొదటగా ఆయన పాడిన Mr పెళ్ళాం సినిమా లోని “సరికొత్త చీర” పాటను చరణ్ గారి చేత పాడించారు. చరణ్ గారి గొంతు అచ్చు బాలు గారి గొంతు మాదిరే ఉండింది.

ఇక రెండవ పాట “సువ్వి సువ్వి” పాట. ఇది బాలు గారు, శైలజ గారు కలిసి పాడారు. మొదట్లో ఆయన రాగం తియ్యటం, శైలజ గారు సరిదిద్దటం, అచ్చు సినిమాలో ఉన్నట్లే చేసారు. ఆ పాట లో బాలు గారు ఒక line చాలా అందంగా పాడారు సినిమాలో. “గుండే లేని మనిషల్లే..” ఇప్పటికి కూడా గొంతు లోని ఆ తియ్యదనం అలానే ఉంది. ఆయనకి ఆ గొంతు దేవుడు ఇచ్చిన వరం.

తరవాత, “రవి వర్మ కే అందనీ ఒకే ఒక అందానివో” పాట. బాలు గారు మరియూ “పాడుతా తియ్యగా” కార్యక్రమం విజేత గోపికా పూర్ణిమ గారు పాడారు. గోపిక గారి గొంతు బాలు గారి తో బాగుంది. ఆవిడ చరణ్ గారి తో, మల్లిఖార్జున్ గారితో కూడా పాడింది కాని, బాలు గారి దెగ్గర ఆవిడ కొంచెం దృష్టి పెట్టి పాడింది. ఈ పాట లో ఆవిడ కి పెద్దగా ఎమీ లేదు పాడటానికి. నేపథ్య ఆలాపన మాత్రమే. ఇంతకీ, బాలు గారి గొంతు అలానే ఉంది. super గా.

ఇక ఆ తరవాత నాకు చాలా ఇష్టమైన పాట, “ఏ దివిలో విరిసిన పారిజాతమో”. చివర్లో ఆలాపనలు ఆయన కొంచెం మార్చారు. ఎందుకో తెలీదు. ఐనా బాగుంది. ఈ పాట బాలు గారు పాడినట్టుగా ఎవ్వరూ పాడలేరు.

ఇదంతా నేను నిన్న office కి డుమ్మా కొట్టటం వల్ల వచ్చిన లాభాలు. :)
సాయంకాలం ఒక ఇంటర్‌వ్యూ ఉండబట్టి కార్యక్రమం మొత్తం చూడలేక పొయ్యా.
ఈ music concert గురించి ఇంకా కావాలంటే, ఈ క్రింది లంకె ను చూడండి.

http://spbindia.blogspot.com/2007/02/telugu-music-concert-feb-16th-2007.html
బాలు గారి లాంటి ఒక గాయకుడు ఇంకొకరు దొరకరు. ఆయన హింది లో పాడితే, హింది ఆయన మాతృభాష అనుకుంటారు.. అరవం లో పాడితే, తమిళాయన అనుకుంటారు. భాష నేర్చుకోవాలన్న పట్టుదల అటువంటిది.
ఆయన గురించి greatandhra site వాళ్ళు వేస్తున్నారు. వీక్షించండి.

http://www.greatandhra.com/telugu/sumgathalu/18-02-2007/sp1_1.php

నేను ఇప్పుడే The Last Don అనే ఆంగ్ల నవల చదివినాను. ఆ పుస్తకం చాలా లావుగా ఉంది. మొదట్లో సుత్తి అనిపించినా, చదవంగా చదవంగా చాలా ఆసక్తిగా ఉండిందీ నవల. Mario Puzo అనే ఆయన రాసిన పుస్తకం ఇది. ఆయన దీని ముందు The Godfather నవల ద్వారా సుపరిచితులు. The Last Don నవల లో ఆయన hollywood మరియు మాఫియా కు ఉన్న లంకెలను చాలా బాగా చూపించారు. వీలుంటే, ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకం.

 ఆ నవల చదివాక, ఇప్పుడు Thomas Harris ది Red Dragon అనే నవల చదువుతున్నాను. మొదటి పది పేజీలలోనే 2 కుటుంబాల హత్య. thriller నవల. ఇప్పటి వరకు బానే ఉంది. మిగితా చదివాక చెబుతాను.

కవిత

మా మిత్రుడు పంపిన ఒక mail లో ఉన్న కవిత. కవి పేరు తెలియలేదు. ఎవరికైనా తెలిస్తే, చెప్పండి. చదవాల్సిన కవిత.. కవి పేరు తెలిస్తే, అభినందించాల్సిన కవిత.

ఆ చివరి రెండు వాక్యాలు చాలు కవిని (కవయిత్రిని) అభినందించటానికి.

“నా దేశాన్ని నాకు దూరం చేసిన,
నా రూపాయి అవిటితనం”.

నాకు ఒక అలవాటు ఉంది. ఏదైనా పాట నచ్చితే, కొన్ని రోజులపాటు వింటూనే ఉంటా. నాకు నచ్చిన అలాంటి పాటలను నా బ్లాగు లో పెట్టుకోవాలి అనిపించింది.  అందుకు, నా sidebar లో ఒక text widget లో ఆ పాట సమాచారం పెడతా. వీలైతే, ఆ పాట ఎక్కడ దొరుకుతుందో ఆ site address కూడా ఇస్తాను.

దీనిని నేను ముందు నుంచే పెడుతున్నా.. ఇప్పుడు పేరు మారుస్తున్న.
పేరు: Hot పాట

దీనిని తెలుగు లో ఎమనాలో అర్థం కాలేదు. మీకు తెలిస్తే, చెప్పండి. :)

నేను OpenGL అనే graphics library మీద పని చేస్తున్న. Windows Vista లో OpenGL support లేదంట. అంటే, OpenGL graphics library ఉపయోగించి ఎదైనా గేమ్ ఆడితే, అది యాభై శాతం దాకా మెల్లగా రన్ అవుతుందిట.

ఇదంతా వాళ్ళు (Microsoft) తయారు చేసిన DirectX కోసం. Vista లో DirectX వాడి, open source అయిన OpenGL ని దెబ్బకొడదామనుకుని ఉంటారు. వీళ్ళు ఎప్పటికి మారతారో..

తరువాతి కాగితం »